Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఖాళీ బిందెలతో మహిళల నిరసన..

ఖాళీ బిందెలతో మహిళల నిరసన..

- Advertisement -

విశాలాంధ్ర – గుడిబండ: మండలంలోని పళారం గ్రామంలో గత రెండు నెలలుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన చేపట్టారు.తాగునీటి సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కొంతకాలం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారని మహిళలు తెలిపారు. అయితే గత వారం రోజులుగా తమ ప్రాంతానికి తాగునీటి ట్యాంకర్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి కొరత కారణంగా రోజువారీ జీవనం అస్తవ్యస్తంగా మారిందని వాపోయారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పళారం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు