Homeజిల్లాలుఅనంతపురంప్రైవేట్ వైద్య కళాశాలలతో పేదలకు నష్టం

ప్రైవేట్ వైద్య కళాశాలలతో పేదలకు నష్టం

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) :  ప్రయివేటు వైద్య కళాశాలలతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నందుకు నిరసనగా వైసిపి చేపడుతున్న కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఆయన గురువారం ఉరవకొండ పట్టణంలోని బాలాజీ టాకీస్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి హయాంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను అప్పటి సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మంజూరు చేయించారని చెప్పారు. వీటిలో 7 వైద్య కళాశాలలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలలను పిపిపి పద్ధతిలో ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందని చెప్పారు. దీనివల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య, వైద్యసేవలు దూరమవుతాయని చెప్పారు. సిఎం చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను రాష్ట్రానికి తీసుకురాలేదని చెప్పారు. పేదలకు ఉచిత కార్పొరేట్‌ స్థాయి వైద్యమందకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే టిడిపి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటీకరణ చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం కుట్రపూర్తి రాజకీయాలు చేసి పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
పిపిపి విధానం ద్వారా నిజమైన నిరుపేదలకు విద్య, వైద్యం అందకుండా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తక్షణమే ప్రభుత్వం ఉపసహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, వీరన్న, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఓబన్న, గోవిందు ఆసిఫ్, ఆంజనేయులు, ఆరే రాజశేఖర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు