Homeజిల్లాలుఅనంతపురంబాల బాలికలకు ఉచిత నేత్ర పరీక్షలు

బాల బాలికలకు ఉచిత నేత్ర పరీక్షలు

- Advertisement -

విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా త్వరిత చికిత్స కేంద్రమునందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవిగారి ఆదేశాల మేరకు ఉచిత నేత్ర పరీక్షలు మరియు ఉచిత కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు గ్రామాల నుంచి విద్యాసంస్థల, రెసిడెన్షియల్ కాలేజీ ల నుంచి దృష్టి దోషాలతో వచ్చిన బాల బాలికలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మొత్తం 26 మందికి ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేయడమైనది. డి ఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ ఈ బి దేవి మాట్లాడుతూ… పిల్లలలో దృష్టి లోపాల తో వచ్చే సమస్యల గురించి వివరించి, ఆధునిక హై ఇండెక్స్ కళ్లద్దాలతో పాలికార్బినేటెడ్ ప్రేమ్స్ ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకం అన్నారు. కార్యక్రమం నిర్వహణ అధికారి డాక్టర్ విష్ణు మూర్తి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి గ్రామంలో పుట్టుకతో లోపం ఉన్న పిల్లలందరికీ ఈ త్వరిత చికిత్స కేంద్రం నందు మేము అందిస్తున్న సేవల గురించి తెలియజేసి భాగస్వాములు కావాలన్నారు. పుట్టుకతో వచ్చు శుక్లాలకు మరియు మెల్లకన్ను గళ పిల్లలకు ఉచిత శస్త్ర చికిత్సలు కూడా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ షేక్ సదియ మొహమ్మది, డాక్టర్ హరిదీప్ నాయక్, ఆప్టో మెట్రిస్ట్ శ్రీమతి జ్ఞాన ప్రసన్న,మేనేజర్ శ్రీమతి రజిత గారు మరియు ఇతర డి ఈ ఐ సి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు