Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత ఐ ఓ ఎల్ కంటి వైద్య శిబిరం విజయవంతం.. యువర్స్ ఫౌండేషన్

ఉచిత ఐ ఓ ఎల్ కంటి వైద్య శిబిరం విజయవంతం.. యువర్స్ ఫౌండేషన్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరం విజయవంతం కావడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో ధర్మవరం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో మొత్తం 50 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 30 మంది కంటి శస్త్రచికిత్సకు(కంటి ఆపరేషన్) ఎంపికయ్యారు అని తెలిపారు. అవసరమైన వారికి తదుపరి కంటి ఆపరేషన్లు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్యాంప్ డోనర్ బి.ఆర్. రంగనాథం, డాక్టర్ భరత్ను యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో యువర్స్ ఫౌండేషన్ సభ్యులు శ్రీ బండ్లపల్లి రంగనాథ్ గారు, చాంద్ బాషా ,చౌటిపల్లి రాధాకృష్ణ ,గర్రి రమేష్ బాబు , మాజీ కౌన్సిలర్ కేతా లోకేష్ , వెంకట మోహన్ ,భీమిశెట్టి కృష్ణమూర్తి ,కేఎన్ కళ్యాణ్ చక్రవర్తి, ఓవీ ప్రసాద్ , కీర్తి మాల , శంకు సుకుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు