విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : పెద్దకడబూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలంటూ సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి స్వగృహం నందు వైసీపీ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. అనంతరం వైసీపీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ రాష్ట్ర అధినేత జగన్మోహన్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి ఆదేశాల మేరకు పాదయాత్రగా భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, బూత్ కమిటీ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో వర్షాభావ పరిస్థితి కారణంగా రైతులు వేసిన పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై ఉన్న వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేసి రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పనులు లేక వలసలు వెళ్లకుండా ఉపాధి హామీ పని దినాలను పెంచి కూలీలను ఆదుకోవాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వలిబాషాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘురామ్, యువ నాయకులు శివరామరెడ్డి, చంద్రశేఖర్, గజేంద్ర రెడ్డి, షేర్ ఖాన్ పటేల్, రైతు విభాగం తాలూకా అధ్యక్షులు కేపీ యల్లప్ప, వైసీపీ స్టూడెంట్ విభాగం నాయకులు మైబూబ్, నాయకులు సత్య గౌడ్, నర్సింగప్ప, బ్రహ్మయ్య, కడబూరి, లక్ష్మన్న, హనుమంతరెడ్డి, చిన్న వీరేష్, బొడ్డన్న, గాదిరెడ్డి, జాము అంజినయ్య, మాధవరెడ్డి, కామయ్య, రమేష్, బీరప్ప అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దకడబూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
- Advertisement -
RELATED ARTICLES


