విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్‌ను పరిశుభ్రంగా పరిరక్షించి, వాకింగ్ ట్రాక్ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తప్పక చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు, వాకింగ్, వ్యాయామ దారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ధర్మవరం పట్టణ ప్రజల ఆరోగ్యం, పారిశుధ్యం ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని తెలిపారు.ధర్మవరం కాలేజ్ గ్రౌండ్‌ను 104 వాహనాల పార్కింగ్‌కు, అలాగే 104 వాహనాలకు సంబంధించిన సామగ్రిని ఉంచడానికి వినియోగించినట్లు స్థానిక ప్రజల దృష్టికి వచ్చింది అని, ఈ వినియోగం అనంతరం గ్రౌండ్ పరిసర ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహారపు ప్లేట్లు ఇతర చెత్త పేరుకుపోయి, ప్రస్తుతం గ్రౌండ్ పరిశుభ్రత దెబ్బతిన్న పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.ఈ గ్రౌండ్‌ను ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం స్థానిక ప్రజలు వాకింగ్, వ్యాయామం ఆరోగ్య పరిరక్షణ కోసం వినియోగిస్తున్నారు అని, కావున గ్రౌండ్లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించి, పూర్తి స్థాయిలో శుభ్రపరిచి, ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించవలసిందిగా వారు తెలిపారు.
అదేవిధంగా, ధర్మవరం పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా కాలేజ్ గ్రౌండ్లో శాశ్వత వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయడం, అవసరమైన లైటింగ్, పారిశుధ్య సదుపాయాలు, చెత్త బుట్టలు,ఇతర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి చర్యలను చేపట్టవలసిందిగా వారి తెలిపారు.
భవిష్యత్తులో గ్రౌండ్లో చెత్త పేరుకుపోకుండా నియమిత పారిశుధ్య నిర్వహణ చేపట్టడంతో పాటు, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు కూడా చేపట్టాలని తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ భారత్ – క్లీన్ అండ్ గ్రీన్ ధర్మవరం”అనే లక్ష్యానికి అనుగుణంగా ధర్మవరం కాలేజ్ గ్రౌండ్‌ను పరిశుభ్రంగా, పచ్చదనంతో ప్రజలకు ఆరోగ్యకరమైన వాకింగ్ ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు.ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ అత్యవసర ప్రజా సమస్యగా పరిగణించి, సంబంధిత అధికారులు స్థలాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
పట్టణ కాలేజీ క్రీడామైదామును పరిశుభ్రంగా ఉంచేందుకు తప్పక చర్యలు తీసుకోవాలి.. ప్రజల ఆవేదన
- Advertisement -
RELATED ARTICLES


