విశాలాంధ్ర ధర్మవరం;; జాతీయ ఉపకార వేతన అర్హత పరీక్ష(ఎన్ ఎం ఎం ఎస్)కు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని ఒక పుస్తక రూపంలో రూపొందించిన జన విజ్ఞాన వేదిక , ఐక్య ఉపాధ్యాయ సంఘం ఇందుకు సంబంధించిన ఎన్ ఎం ఎం యస్ పుస్తకాలను జన విజ్ఞాన వేదిక నాయకులు , యుటిఎఫ్ నాయకుల తో కలిసి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆదిశేషు, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి వి లోకేష్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణ రెడ్డి ,కౌన్సిలర్ మేరీ వర కుమారి జిల్లా విడుదల చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పరీక్షల్లో విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి 12 వేల చొప్పున 4 సంవత్సరాలు విద్యార్థులకు స్కాలర్షిప్ గా ఇస్తుందన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి మంచి పుస్తకాన్ని జెవివి, యు టి ఫ్ లు సంయుక్తంగా రూపొందించి విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడం అభినందనీయం అన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎన్ ఎం ఎం ఎస్ పరీక్ష రాసే విద్యార్థులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో యుటియఫ్ నాయకులు, జన విజ్ఞాన వేదిక నాయకులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
ఎన్ ఎం ఎం ఎస్ పుస్తకాలు విడుదల చేసిన యుటిఎఫ్ నాయకులు
- Advertisement -
RELATED ARTICLES


