Homeజిల్లాలుశ్రీ సత్యసాయియుటిఎఫ్ ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ శిక్షణ కార్యక్రమం విజయవంతం

యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ శిక్షణ కార్యక్రమం విజయవంతం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక బిఎస్సార్ బాయ్స్ హై స్కూల్ నందు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సైకాలజీ సబ్జెక్ట్, తెలుగు సబ్జెక్ట్ నందు నందు ఉచిత శిక్షణ కార్యక్రమమును యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి , పెనుకొండ యుటిఎఫ్ సీనియర్ నాయకులు నారాయణస్వామి ప్రారంభించారు.ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ యుటిఎఫ్ రాష్ట్ర కేంద్రం ఆదేశాల మేరకు ఉపాధ్యాయులు సులభంగా టెట్ పరీక్ష నందు ఉత్తీర్ణతవుటకు తమవంతుగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని , ఇందులో భాగంగా సైకాలజీ సబ్జెక్టు నందు చాంద్ భాషా, తెలుగు సబ్జెక్ట్ నందు రామకృష్ణ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 11వ తేదీ నుంచి స్పెషల్ టెట్ పేరుతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ పరీక్ష నందు ఉపాధ్యాయులందరూ ఉత్తీర్ణత కావడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. శిక్షణకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి సహకరించిన చాంద్ భాషా కు, రామకృష్ణ కు యూటీఎఫ్ నాయకత్వం ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి,ఈ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి రామావత్ ,రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి, పెను కొండ యుటిఎఫ్ సీనియర్ నాయకులు నారాయణస్వామి, ధర్మవరం డివిజన్ నాయకులు ఆంజనేయులు, రామాంజనేయులు, పెద్దకోట్ల సురే తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు