విశాలాంధ్ర ధర్మవరం;!ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ వంటి రక్షణ, భద్రతా రంగాల్లో ఉద్యోగాలు సాధించి దేశసేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న ధర్మవరం నియోజకవర్గ యువతకు మంచి అవకాశాన్ని కల్పించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితులు ప్రతిభావంతులైన యువతకు శిక్షణకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో సంస్కృతి సేవా సమితి సహకారంతో, తిరుపతికి చెందిన ఎస్వీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ ఉద్యోగాలకు అవసరమైన ఉచిత శిక్షణ అందించేందుకు కార్యక్రమాన్ని రూపొందించినట్లు వారు తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో ప్రతిభ, ఆసక్తి, అర్హత ఉన్న యువతను గుర్తించి వారికి ఉద్యోగ నియామక ప్రక్రియకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం ద్వారా వారి లక్ష్య సాధనకు అవసరమైన సహకారం అందించడం జరుగుతుందన్నారు. ఆర్మీ, పోలీస్, పారా మిలిటరీ తదితర రక్షణ, భద్రతా రంగాల ఉద్యోగ నియామకాల్లో విద్యార్హతలతో పాటు శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, పరుగు, శారీరక సామర్థ్య పరీక్షలు, రాత పరీక్షలు, ఎంపిక ప్రక్రియపై అవగాహన వంటి అంశాలు కీలకంగా ఉంటాయని తెలిపారు.గత శిక్షణతో అద్భుత ఫలితాలు.. 236 మందికి 220 మందికి ఎంపిక కావడం జరిగిందని,
ప్రతి ఏటా 100 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతోంది అని తెలిపారు.
ఇటీవల నిర్వహించిన అగ్నివీర్ అభ్యర్థుల పరీక్ష/ఎంపిక ప్రక్రియలో ధర్మవరంలో 236 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 220 మంది ఎంపిక కావడం ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా యువతకు అందుతున్న మార్గదర్శకత్వానికి నిదర్శనమని తెలిపారు. దేశసేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న యువతకు విలువైన అవకాశం అని తెలిపారు.మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్లు:
మల్లిఖార్జున – 7998256789, నరేంద్ర – 9490442576. సంప్రదించాలన్నారు.
ఎస్వీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
- Advertisement -
RELATED ARTICLES


