విశాలాంధ్ర-ఒంగోలు : కేర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం బేసినేనిపల్లిలో క్రీస్మస్ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 130 మంది పైగా వెనుక బడిన ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కేర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఎం. వర్మ నిరీక్షణ పర్యవేక్షించారు. వైద్య ప్రముఖ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్ధోపెడిక్, డయాబెటిక్, సీజనల్ వ్యాధులు, దగ్గు, జలుబు, జ్వరము, డెంటల్, ఫిజియోథెరపీ(కండరాల నోప్పులు, జాయింట్ నోప్పులు) సంబంధించిన వైద్యం అందించారు. ప్రత్యేకంగా ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి యాజమాన్యం కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రముఖ వైద్యులు ఆశిష్, రేష్మా సుగుణాకర్, మోజెస్ సుగుణాకర్, ఆశోక్, సువర్ణ, రాజేశ్వరి వైద్య సేవలు అందించారు.
బేసినేనిపల్లిలో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
RELATED ARTICLES


