విశాలాంధ్ర-తాడిపత్రి: శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో తాడిపత్రిలో వర్షాలు బాగా కురిసి ప్రజలు పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం, శ్రీ పార్వతీదేవి అమ్మవారికి శాకంబరిదేవి అలంకారం చేసి అత్యంత భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించారు. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దయతో తాడిపత్రిలో వర్షాలు కురిసి పెన్నా నదికి నీరు వచ్చి చేరుతోంది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెన్నా నదికి సోమవారం సాయంత్రం వేళలో అర్చకులు రవి శర్మ, బాలానంద శర్మ, గిరి శర్మ, శంకరయ్య శర్మ, మహేశ్వర శర్మ, శంతన శర్మ లు అత్యంత భక్తి శ్రద్దల నడుమ గంగా హారతి ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు చంద్రమోహన్, రంగనాథ తదితరులు పాల్గొన్నారు.


