Homeఆంధ్రప్రదేశ్ఏపీ, తెలంగాణలకు చల్లని కబురు: హైదరాబాద్‌ను తాకిన నైరుతి

ఏపీ, తెలంగాణలకు చల్లని కబురు: హైదరాబాద్‌ను తాకిన నైరుతి

- Advertisement -

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా పురోగమిస్తున్నాయి. ఇవి తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న 4 నుంచి 5 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఆదివారం నాటికి రుతుపవనాల ఉత్తర సరిహద్దు (నార్తర్న్ లిమిట్ ఆఫ్ మాన్‌సూన్) మహారాష్ట్రలోని హర్నై, సోలాపూర్ మీదుగా ప్రయాణిస్తూ.. తెలంగాణలోని హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడి నుంచి పారాదీప్, బరిపడ, ధన్‌బాద్ మీదుగా ముజఫర్‌పూర్ వరకు రుతుపవనాల విస్తరణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేసింది.

రానున్న 4-5 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. అలాగే ఒడిశా, ఝార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లోకి కూడా ఇవి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తన తాజా బులెటిన్‌లో వివరించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు