ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ఉత్తమ ఎస్ ఎల్ ఎఫ్ అవార్డు గ్రహీతగా నందిగామ ఎస్ఎల్ఎఫ్….
విశాలాంధ్ర నందిగామ:-నందిగామ మున్సిపాలిటీకి ఉత్తమ స్వచ్ఛ అవార్డు లభించడం ఎంతో గర్వకారణం అని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు ముందుగా స్వచ్ఛ అవార్డు లభించడానికి కారకులుగా నిలిచిన నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్ లోవరాజును ఆమె దుశ్యాలవాలతో సన్మానించి అవార్డు అందజేసి అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందిగామ మున్సిపాలిటీ రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా గుర్తింపు పొందటం మన అందరికీ గర్వకారణం అని దీనికి ప్రజల సహకారం పూర్తిగా ఉందని అన్నారు మున్సిపల్ సిబ్బంది వారి కష్టంతోనే పట్టణ అభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటు వల్లే ఈ అవార్డు సాధ్యమైందని నందిగామకు మరింత పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు ఈ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజయాన్ని సాధించడంలో అందించిన మార్గదర్శకతను వివరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా పట్టణానికి మరొక గౌరవనీయమైన గుర్తింపు లభించిందని స్వచ్ఛ ఎస్ ఎల్ ఎఫ్ ఆంధ్ర మహిళ గా నందిగామ కు చెందిన ఎస్ఎల్ఎఫ్ ఎంపిక కావడం జరిగిందని తెలిపారు మెప్మా సిబ్బంది మరియు స్థానిక మహిళా సంఘాలు సమిష్టిగా కృషి చేసిన ఫలితమే ఈ అవార్డుకు నాంది పలితాయని పేర్కొన్నారు ఈ విజయాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించి నందిగామ రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మెప్మా సీఎం ఏం నిర్మల,మెప్మా సిబ్బంది, మెప్మా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు….


