విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురము జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఈ.బి. దేవి ఆధ్వర్యంలో, ఆర్‌బీఎస్‌కే జిల్లా కార్యక్రమ అధికారి డా. ఎస్.బి. విష్ణుమూర్తి పర్యవేక్షణలో, బుధవారం డిఈఐసి నందు గ్రహణ మొర్రి మరియు పెదవి చీలిక కార్యక్రమం ఏవిర్ హాస్పిటల్ వారి సహకారం తో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుంచి గుర్తించబడిన పిల్లలను తీసుకువచ్చి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు నిపుణ వైద్యుల ద్వారా సమగ్రంగా పరిశీలించారు. అవసరమైన చిన్నారులకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏవిఆర్ ఆసుపత్రి వారు ఈ శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ గ్రహణమొర్రి శిబిరానికి మొత్తం 12 మంది చిన్నారులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
శస్త్రచికిత్స అవసరమైన 9 మంది పిల్లలను గుర్తించి, వారికి ఉచితంగా చికిత్సలు అందించే విధంగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో గ్రహణమొర్రి– పెదవి చీలికలకు ఉచిత వైద్య శిబిరం
- Advertisement -


