పుస్తకాలను అందజేస్తున్న రమేష్, కృష్ణ..
విశాలాంధ్ర-డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా):మండలంలోని అడపావలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.విశాఖపట్నం వాస్తవ్యులు, అంతర్జాతీయ గాయకులు, ఆర్కెస్ట్రా అధినేత శేఖర్ సహకారంతో పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్, జిల్లా నాయకులు కృష్ణ సుమారు 20 విద్యార్థిని-విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు తదితర విద్యా సామగ్రిని తమ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యే భవిష్యత్తుకు పునాదని పేర్కొంటూ, విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. విద్యాభివృద్ధే సమాజ పురోగతికి మార్గమని పేర్కొంటూ, అవసరమైన చోట సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని దాతలను అభినందించారు. అలాగే ప్రధానోపాధ్యాయుడు రాంప్రసాద్, విద్యార్థిని-విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


