- Advertisement -
విశాలాంధ్ర పెనుకొండ.. సత్య సాయి జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ మంత్రి మౌర్య భరద్వాజ బుధవారం పెనుకొండ తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అడదకులపల్లి గ్రామానికి సంబంధించిన రీసర్వే వీఆర్ఓ లాగిన్ డేటా ఎంట్రీని సమీక్షించారు. జీటీ దశ నుండి ఇప్పటివరకు చేపట్టిన రీసర్వే ప్రక్రియపై సంబంధిత వీఆర్ఓ, వీఎస్, ఎంఎస్ మరియు తహశీల్దార్ నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీ కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీఓ టి. ఆనంద కుమార్ మరియు తాసిల్దార్ స్వాతి, డిఐఓఎస్ పాల్గొన్నారు.


