విశాలాంధ్ర ధర్మవరం;;హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ప్రపంచ కరాటే ప్రదర్శనలో పాల్గొని, అద్భుతమైన నైపుణ్యంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన “సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ” విద్యార్థులకు ధృవీకరణ పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా అకాడమీ ప్రధాన శిక్షకులు మాస్టర్ సిరిపి వెంకటేష్ చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భంగా మాస్టర్ సిరిపి వెంకటేష్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో, కఠిన శ్రమతో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో గిన్నిస్ రికార్డు సాధించడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. చిన్నతనంలోనే కరాటే వంటి ఆత్మరక్షణ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రత, ధైర్యం పెరుగుతాయని తెలిపారు. భవిష్యత్తులో మన అకాడమీ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా మెరుగైన శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు.
మాస్టర్ సిరిపి వెంకటేష్ చేతుల మీదుగా రికార్డు సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులు: ఎన్. వేద శ్రీ, సంగాల భరద్వాజ్, చందన్, పునీత్, వరుణ్, లోకేష్, యశ్వంత్, వంశీ కృష్ణ, హేమంత్, ఉజ్వల్, ప్రణవి, లాస్య, నమ్రత సాయి, కుషాల్. ఉన్నారని తెలిపారు.విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దిన మాస్టర్ సిరిపి వెంకటేష్ గారికి మరియు విజేతలైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
అట్టహాసంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవం
- Advertisement -
RELATED ARTICLES


