Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచేనేత సమస్యలు పరిష్కరించకపోతే పురుగుల మందు డబ్బాలతో ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తాం

చేనేత సమస్యలు పరిష్కరించకపోతే పురుగుల మందు డబ్బాలతో ఆర్డీవో కార్యాలయం ముట్టడిస్తాం

- Advertisement -

.విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత సమస్యలు పరిష్కరించకపోతే పురుగుల మందు డబ్బాలతో ఆర్డిఓ కార్యాలయమును ముట్టడిస్తాము అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్హులైన చేనేత కార్మికులకు 25వేల రూపాయలు డబ్బు వేయకుండా అర్హులేని వారికి వేశారని వారు ఆరోపించారు. ఆగస్టు 15వ తేదీ లోపు అర్హులైన చేనేత కార్మికులకు అకౌంట్లో నేతన్న పథకం 25 వేల రూపాయలు తప్పక ప్రభుత్వం వేసి తీరాల్సిందేనని తెలిపారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15000 మందికి నేతన్న నేస్తం పథకమును అందించామని ప్రస్తుతం కేవలం 6000 మందికి మాత్రమే అందించారని తెలిపారు. ఇందులో భాగంగా హ్యాండ్లూమ్ అధికారులను పిలిపించి అర్హులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తదుపరి ఆర్డీవో రామ భూపాల్ రెడ్డి కి అర్హులైన చేనేత కార్మికుల జాబితాను అందించారు. గతంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు జోలి పట్టి భిక్షాటన చేసి చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకున్నామని వారు గుర్తు చేశారు. అంతేకాదు దాదాపు 22,000 మందికి ఇంటి పట్టాలను ఇప్పించడం జరిగిందని తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత కరెంటు వారికి ఇస్తున్నారని మరి ఉచిత కరెంటు వస్తున్న చేనేత కార్మికులకు డబ్బులు ఎందుకు పడలేదని వారు ప్రశ్నించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కాచర్ల అంజి, గడ్డం రంగ, చందమూరి నారాయణరెడ్డి, వాసపల్లి సాయికుమార్, పెద్దిరెడ్డి గారి శ్రీనివాసులు, షేక్ షాన్ భాష, కోటిరెడ్డి బాలిరెడ్డి, చెలిమి పెద్దన్న, శంకర తేజ, కత్తి పెద్దన్న, బ్రహ్మయ్య, దేవరకొండ రమేష్, ఈశ్వరయ్య, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు