Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేతన్న సేవలో పథకంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు..

నేతన్న సేవలో పథకంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు..

- Advertisement -

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; నేతన్న సేవలో పథకంపై ఎలాంటి ఆందోళన అవసరము లేదని ప్రతి ఒక్కరికి నేతన్న నేస్తం అందుతుందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలోని చేనేత కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడి అర్హులైన ప్రతి నేతన్నకు పథకం అందేలా చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ‘నేతన్న సేవలో’ పథకం కింద ఇప్పటికే 71,536 మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం జమ అయిందని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మరో 13,768 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సెలవు దినాలు ఉన్నందున బ్యాంకులో డబ్బులు పడలేదని, అలాంటప్పుడు దీనిని అర్థం చేసుకోకుండా కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం చేనేత కార్మికుల్లో అనవసరమైన అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సైతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ‘నేతన్న సేవలో’ పథకం అందుతుందని స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు.మగ్గం ఉన్న అర్హులైన నేతన్నలు వెంటనే సచివాలయంలో నమోదు చేసుకోవాలి అని తెలిపారు. హ్యాండ్లూమ్ విభాగం అధికారులతో, మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి అన్ని సచివాలయాలకు సమాచారం అందించినట్లు తెలిపారు. చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందించాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.
చేనేత కార్మికుల సమస్యలను రాజకీయాలకు వాడుకోవద్దని హరీష్ బాబు వైఎస్సార్‌సీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. పథకంలో సాంకేతిక కారణాల వల్ల జరిగిన ఆలస్యాన్ని కూడా ప్రభుత్వంపై నిందలు వేయడానికి ఉపయోగించుకోవడం తగదన్నారు.
గత పాలనలో జరిగిన ఘటనలపై ప్రజలకు సమాధానం చెప్పాలి అని అంటారు తెలిపార ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పేందుకు ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కృషి చేస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో స్థానిక రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలు, ఆందోళనల పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఇటీవల ఒక వైఎస్సార్‌సీపీ కార్యకర్త మృతి ఘటనను ప్రస్తావిస్తూ హరీష్ బాబు, ఆ ఘటనపై చట్టపరమైన దర్యాప్తు జరుగుతున్న సమయంలో దానిని రాజకీయంగా మలచి ఇతర అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేయవద్దని సూచించారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు గతంలో చేసిన రాజకీయ తప్పిదాలను ప్రజలు మరిచిపోలేదని అన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి
సత్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ధర్మవరంలో అభివృద్ధి, సంక్షేమం, శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తాం అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు