విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుందని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున అన్నారు. బుధవారం మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పెద్దకడబూరు మండలంలో రెండేళ్లలో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన కరపత్రాలను ఇంటింటికీ అందించారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల ఆదరణతో మరింత సేవాభావంతో ముందుకు సాగుతామని అయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథ రాముడు, యూనిట్ ఇంచార్జ్ అంజి, సొసైటీ చైర్మన్ నరసప్ప, టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి మునెప్ప , సొసైటీ సభ్యులు సంజీవ, జాలవాడి గ్రామ అధ్యక్షుడు జాలవాడి వెంకన్న, , బూత్ ఇంచార్జ్ రాఘవరెడ్డి, నాయకులు నాగరాజు, బాషా, చెన్నకేశవ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి పాలన
- Advertisement -


