విశాలాంధ్ర – నల్లజర్ల : స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పచ్చదనం-పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని ఆవపాడు సర్పంచ్ అచ్యుత సత్యనారాయణ పిలుపునిచ్చారు. వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక సేవా శిభిరంలో భాగంగా ఆఖరి రోజు శనివారం ఆవపాడు గ్రామంలో పచ్చదనం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత , స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలిమెంటరీ స్కూలు వద్ద జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ మాట్లాడుతూ వైజ్ విద్యార్ధులు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. పచ్చదనం పరిశుభ్రత అంశాలపై గ్రాస్ రూట్ వరకు ప్రజలను సమాయత్తం చేయాలని సర్పంచ్ అన్నారు. ఇప్పటికే తన హయాంలో గ్రామంలో నాటిన మొక్కలను, వాలంటీర్లు నాటిన మొక్కలు సంరక్షించే బాద్యతలను వాలంటీర్లు తీసుకోవాలని సర్పంచ్ దిశానిర్దేశం చేశారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆకుల త్రిమూర్తి మాట్లాడుతూ పల్లె సీమలే పట్టుకొమ్మలని, గ్రామం బాగుంటే దేశం అభివృద్ధి సాధిస్తుందని ఆ దిశగా ప్రజలను కార్యోన్ముఖులను చేస్తూ విద్యార్ధులు ముందుకు వెళ్లాలన్నారు. ఆవపాడు గ్రామంలో పరిశుభ్రత పరిడవిల్లేలా సర్పంచ్ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రత్యేక సేవా శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు కేంపు సర్టిఫికెట్లను సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం స్కూల్ ఆవరణలో సర్పంచ్, కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, వాలంటీర్లు మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.అరవిందకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రముఖుడు బాబ్జీ, స్కూల్ హెచ్ఎం టి.మంగయ్య, ఎన్ఎస్ఎస్ జిల్లా అధికారి కె.మురళీధర్ తదితరులు మాట్లాడారు. తొలుత పచ్చదనం పరిశుభ్రత, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, రూరల్ శానిటేషన్, జలజీవన్ మిషన్, ఇంటింటికి చెత్త సేకరణ తదితర కార్యక్రమాలపై ఇంటింటా అవగాహన కల్పించారు.కార్యక్రమంలో వైజ్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
వైజ్ ఇంజనీరింగ్ కళాశాల, ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత
- Advertisement -
RELATED ARTICLES


