గ్రామీణ ఉపాధి మెగా గ్రామ సభలు నిర్వహణ
విశాలాంధ్ర – సీతానగరం : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సేవలను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ఈ గ్రామ సభలను నిర్వహించినట్లు ఎంపిడిఓ ఎమ్ భారతి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో శనివారం మెగా గ్రామసభలు జరిగాయి. దీనిలో ఎంపిడిఓ ఎమ్ భారతి, ఎ. పి. ఓ సత్యవతి, టెక్నికల్ అసిస్టెంట్లు వీరబాబు, సింహాద్రి, కంప్యూటర్ ఆపరేటర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ భారతి మాట్లాడుతూ ఈ గ్రామ సభలలో తొలగించిన జాబ్ కార్డుల వివరాలను చదివి వినిపించడమైనదని, కొత్త జాబ్ కార్డుల కొరకు 175 ధరఖాస్తులను స్వీకరించడం జరిగింది. అదే విధంగా క్రొత్త పనులను కూడ గుర్తించడం జరిగింది. తొలగించిన జాబ్ కార్డులను పునః పరిశీలన చేయగా 62 మంది జాబ్ కార్డు దారులు వారి కార్డులను తిరిగి రెన్యువల్ చేయడం జరిగింది అని అన్నారు. దానితో పాటు 13 కొత్త పనులను గుర్తించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సర్పంచ్లు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూటమి పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


