Homeఆంధ్రప్రదేశ్రైతుల అభ్యున్నతికే రైతన్న - మీ కోసం

రైతుల అభ్యున్నతికే రైతన్న – మీ కోసం

- Advertisement -

విశాలాంధ్ర – సీతానగరం:  రైతుల అభ్యున్నతికే రైతన్న మీ కోసం నవంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది అని మండల వ్యవసాయ అధికారిని గౌరీ దేవి అన్నారు. ఈ సందర్భంగా గౌరీ దేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశాల ప్రకారం రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధికి శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యంగా ఈ వారోత్సవాలు ఇంటింటి ప్రచారం కార్యక్రమం గా నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. దీనిలో భాగంగా నవంబర్ 24 నుంచి 29 వరకు రైతుల ఇళ్లను సందర్శిస్తారు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు సందర్శనల ద్వారా సేకరించిన డేటా ను సమీకరించి వాటిపై విశ్లేషణ చేయాలన్నారు. డిసెంబర్ 3న 2026–27 సంవత్సరానికి  చెందిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి ప్రతీ రైతు సేవా కేంద్రంలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. కావున రైతులందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. 

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు