Homeఆంధ్రప్రదేశ్తప్పులుంటే సరి చేస్తాం

తప్పులుంటే సరి చేస్తాం

- Advertisement -

సమిత్వ సర్వే లో  తప్పులుంటే సరి చేస్తాం

విశాలాంధ్ర – తాళ్లపూడి  : తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం లో  స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ రాపాక రాజేశ్వరి అధ్య క్షతన జరిగింది. సమిత్వా సర్వే లో గుర్తించిన ఇళ్ల కొలతలు, స్థలాల కొలతల వివరాలను వెల్లడిస్తు, ఆయా ఇళ్ల యజమానులకు 9(2) నోటీస్ లు  అందచేశారు. ఈ సమావేశమునకు హాజరైన ఇంచార్జి ఈ.ఓ.పి ఆర్డీ వీరన్న, తహసీల్దారు లక్ష్మీ లావణ్య ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సంద ర్బంగా కార్యదర్శి కామేశ్వరి మాట్లాడుతూ, ధ్రువీకరణ పాత్రల్లో పేర్కొన్న ప్రకారం ఇళ్ల కొలతలు, స్థలాల కొలతలు తేడా ఉన్నట్లు గుర్తిస్తే వాటిని పిర్యాదుగా స్వీకరించి పరిష్కరిస్తా మని తెలిపారు. ఈ కార్యక్రమం లో  వి.ఆర్.ఓ.ప్రకాష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు