ఏఐవైఎఫ్ పిలుపు..
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : జనవరి 30 న జరగనున్న “చలో విజయవాడ – నిరుద్యోగ రణభేరి” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.శ్రీనివాస్ పి.త్రిమూర్తులు పిలుపునిచ్చారు.అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో రాజమండ్రి స్థానిక మల్లయ్య పేట అంబేద్కర్ విగ్రహం వద్ద నిరుద్యోగ రణభేరి కి సంబంధించి గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు మాట్లాడుతూ…..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, అసంతృప్తిలో ఉన్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ‘కూటమి’ ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు అమలు చేయకపోవడం, నోటిఫికేషన్ల విడుదలలో నిర్లక్ష్యం వహించడం వల్ల లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల అరవై రెండు వేల మందిని వాలంటీర్లను అలాగే ఎండియు లను సచివాలయ సిబ్బందిలను తీసివేయడం చాలా దారుణమని ఈ పరిస్థితులకు నిరసనగా నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం జనవరి 30న విజయవాడలో “నిరుద్యోగ రణభేరి – చలో విజయవాడ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు
తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని,ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలిని, ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలి, ఔట్‌సోర్సింగ్–కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ,
“కొలువులోకై కొట్లాడుదాం రండి!” అని నినాదం చేస్తూ జనవరి 30 న విజయవాడ కు భారీగా తరలిరావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ బి.సుభాష్ ఎం.నరేష్ కే.సునీల్ పి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు


