Thursday, January 15, 2026
Homeజిల్లాలుపార్వతీపురం మన్యంపూర్వ విద్యార్థి, ఇస్రో సైంటిస్ట్ ను సత్కరించిన హెచ్ఎం,ఉపాధ్యాయులు

పూర్వ విద్యార్థి, ఇస్రో సైంటిస్ట్ ను సత్కరించిన హెచ్ఎం,ఉపాధ్యాయులు

- Advertisement -

విశాలాంధ్ర పార్వతీపురం: జిల్లాలోని సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థి,మండలంలోని బూర్జగ్రామానికి ఈదుబిల్లి ప్రదీప్ నాయుడు ఇస్రో లో సైంటిస్ట్ గా పనిచేయడంతో శనివారం నాడు పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా ఆయనను, అతనిభార్య తేజశ్రీలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ ఎం ఇళ్లా ప్రసన్న లక్ష్మి, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. మూడు రోజులు పాటు బొబ్బిలి రాజా కళాశాలలో ఇస్రో ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, తాను చదివిన పాఠశాలను సందర్శించేందుకు విచ్చేసిన ప్రదీప్ నాయుడు అప్పటి అనుభవాలను, ప్రస్తుతం సైంటిస్ట్ గా ఇస్రో లో అనుభవాలను వివరించారు. బొబ్బిలిలో జరిగిన ఇస్రో పోటీలో పెయింటింగ్ లో ద్వితీయ స్థానాన్ని సాధించిన పాఠశాల విద్యార్థిని తపసం బేగం (8వతరగతి) కు తన చేతుల మీదుగా మెమొంటోను అందజేశారు. ఆమెతోపాటు పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను కూడా అందజేశారు. దీంతోపాటు పాఠశాలకు కూడా తన వంతు జ్ఞాపకార్థం ఒకమెమెంటోను హెచ్ఎంకు అందజేసి, తనకుచేసిన సత్కారానికి కృతజ్ఞతలు తెలిపారు. సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి ఉన్నత స్థానంలో ఉన్న ప్రదీప్ నాయుడును పాఠశాల ఉపాధ్యాయులంతా అభినందన తెలిపారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు పైడిరాజు, నాగరాజు, రామకృష్ణ,మాధవి, కల్యాణలక్ష్మి,సదాశివ, చిట్టిబాబు,రాధ,సుభద్ర,రేణుక, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు