- Advertisement -
- మేడా శ్రీనివాస్
విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ : ఇంటర్మీడియట్ బోర్థులు పిల్లల పాలిట నరక కూపాలుగా వున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి) ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణ చేసారు .. విద్య ముసుగులో శ్రీ చైతన్య, నారాయణ మరి కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు పిల్లలను వేధిస్తూ , హింసిస్తూ చదివిస్తున్నారని, ఈ విద్యా సంస్థల ప్రాగణాలు ఆనాటి ” కాలాపాని జైళ్ళను గుర్తు చేస్తున్నాయన్నారు. బలవంతపు విద్యతో విద్యార్థులను మానసిక రోగులుగా మారుస్తున్న శ్రీ చైతన్య – నారాయణ విద్యా సంస్థల క్రూర చర్యలపై ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా ప్రభుత్వాలు కన్నెర్ర చేయటం మాని వారికి ప్రత్యేక మర్యాదలు కల్పిస్తూ ప్రభుత్వాలనే శాసించే స్థాయి కల్పిస్తున్నారన్నారు. విద్యార్థుల మేధస్సు ను వారి చురుకు తనాన్ని కొన్ని కార్పొరేట్ , ప్రైవేట్ శక్తుల కుట్రలతో వ్యూహత్మకంగా నిర్వీర్యం చేస్తూ కొన్ని వర్గాల బిడ్డల భవిష్యత్ కు మోకాలు అడ్డు పెడుతున్నారన్నారు. నేటి పిల్లలు లక్షలకు లక్షలు ఫీజు కట్టి మరీ నిర్భంద విద్యకు బానిసలుగా మారుతున్నారనీ, కొంతమంది పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక బలవంతంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. విద్యార్థుల సమస్యలు , వారి కష్టాలు పట్టించుకునే ప్రభుత్వ యంత్రాంగమంతా శ్రీ చైతన్య , నారాయణ విద్యా సంస్థలకు బాంచన్ అంటూ సొంత ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. విద్యార్ధుల ఆత్మహత్య లకు ప్రైవేట్, కార్పొరేట్ , శ్రీ చైతన్య , నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలే కారణమన్నారు. శ్రీ చైతన్య , నారాయణ వంటి మరికొన్ని ఈ తరహా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా లయాల ఘోరాలు , నేరాలకు తెలంగాణా రేవంత్ రెడ్డి సర్కార్ , ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కూటమి సర్కార్ ల పూర్తి అండదండలు లభిస్తున్నాయనే ఆరోపణలు మెండుగా వున్నాయని, చిత్తశుద్ధితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీ చైతన్య , నారాయణ విద్యా సంస్థల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ జరిపితే యాజమాన్యం జైళ్లకు వెళ్ళక తప్పదన్నారు. . ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వ పరమైన సంస్టో లేక శ్రీ చైతన్య , నారాయణ విద్యా సంస్థలకు కట్టు బానిసో అర్ధం కాని పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నాయని ఆయన విమర్శించారు. విద్యా సంస్థల దొంగలే చట్ట సభల్లోను కీలక స్థానాల్లో ఉండటం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యార్థుల భవిష్యత్ కు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు ప్రకటించుకుంటున్న ర్యాంకుల పర్వం అంత వట్టి బూటకమని, మాయ,మోసం అని గమనించనలేని తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్ కోసం ఆస్తులు అమ్ముకుని శ్రీ చైతన్య , నారాయణ ఇతర కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీ లకు , స్కూళ్లకు లక్షలకు లక్షలు దారబోస్తున్నారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుతున్న శ్రీ చైతన్య, నారాయణ , ఇతర కొన్ని విద్యా సంస్థల దోపిడిని అరికట్టక పొతే యువత వెలకట్టలేని బంగారు భవిష్యత్ ను కోల్పోతుందని మేడా శ్రీనివాస్ తీవ్ర ఆందోళన చెందారు . సభకు అర్పిసి సీనియర్ సెక్యులర్ సిమ్మా దుర్గారావు అధ్యక్షత వహించారు .ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డి వి రమణమూర్తి , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , కాకర ప్రసాద్ , కారుమూరి యుగంధర్ , వల్లి శ్రీనివాసరావు , యర్రా బాల మురళి కృష్ణ , సుంకర వెంకట భాష్కర రంగారావు ,అనసూరి దేవి చరణ్ , మండవల్లి శంకర్ , మాసా అప్పాయమ్మ , నాగూరి అన్నపూర్ణ , నాగూరు బాబీ , మాసా కమల, మాసా ప్రవీణ్ , పసుపులేటి సుశీల, పసుపులేటి వీర్రాజు , చల్లా దుర్గారావు , మాసా రాహుల్, మాసా కుశలయ్య , చల్లా అఖిల్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ..


