Homeఆంధ్రప్రదేశ్పసిడి ప్రియులకు భారీ ఊరట.. మూడు రోజుల్లో రూ.6,000కు పైగా తగ్గిన బంగారం

పసిడి ప్రియులకు భారీ ఊరట.. మూడు రోజుల్లో రూ.6,000కు పైగా తగ్గిన బంగారం

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పసిడి, వెండి రేట్లు ఒక్కసారిగా కిందికి దిగొచ్చాయి.
కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,680 మేర పడిపోయింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,41,250గా నమోదైంది. వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.10,000 తగ్గి రూ.2,50,000 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా గత మూడు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.6,000కు పైగా తగ్గడం గమనార్హం.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం
ఇరాన్‌పై అమెరికా మరోసారి సైనిక దాడులు ప్రారంభించడం పసిడి ధరల ఈ భారీ పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారంలో ఉన్న తమ పెట్టుబడులను ఇతర మార్గాల వైపు మళ్లిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అంచనాలు, డాలర్ విలువలో చోటుచేసుకుంటున్న మార్పులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ భారీ నష్టం
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు ఏకంగా 106 డాలర్లు తగ్గి 4,323 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ సిల్వర్ కూడా 3.20 శాతం నష్టపోయి ఔన్సుకు 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

రోజులో ధరలు మారే అవకాశం

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు బుధవారం ఉదయం నమోదైనవని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో అదే రోజులోనూ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు