ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
విశాలాంధ్ర తాళ్లపూడి
తాళ్లపూడి మండలం లోని పలుచోట్ల 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లోనూ సంస్థల్లోనూ జాతీయ పతాకావిష్కరణ లు చేపట్టారు. తాళ్లపూడి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏ.ఎస్.ఐ చక్రారెడ్డి జెండా ను ఆవిష్కరించారు.తాళ్లపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డా. హరిక గుప్త జాతీయ జెండాను ఎగురవేసారు. గోధావరి న్యూ చైతన్య ఆటో యూనియన్ అద్వర్యం లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు నామన పరమేశ్వరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సాయి స్ఫూర్తి సి.ఈ.ఓ గూడా విజయ రాజు తాళ్లపూడి లో యువ చైతన్య ఆటో యూనియన్ అద్వర్యం చేపట్టిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఎస్సి సెల్ నాయకులు యాళ్ల బాబురావు, యూనియన్ నాయకులు రజనీ తదితరులు పాల్గొన్నారు. ఆటో లతో యూనియన్ సభ్యులు ర్యాలీ నిర్వహించి సమైక్యతను ప్రదర్శించారు. మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్ధార్ లక్ష్మీ లావణ్య అద్వర్యం లో వేడుకలు నిర్వహించారు. తహసీల్ధార్ లక్ష్మీ లావణ్య పతాకావిష్కరణ చేశారు. మండల పరిషత్ కార్యాలయం లో ఎం.పి.డి.ఓ వేణు గోపాల రెడ్డి అద్వర్యం లో జరిగిన 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీపీ జొన్నకుటి పోసిరాజు ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తాళ్లపూడి లో గల శ్రీ సాయి స్ఫూర్తి ఆస్పత్రి ప్రాంగణం లో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆస్పత్రి ఎం.డి నామా గోపాలం అద్వర్యం లో సి.ఈ.ఓ గూడా విజయరాజు కుమారుడు యువకుడు ఇండియన్ ఆర్మీ సబ్ లెఫ్టినెంట్ గూడా విహస్, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సెంట్ యూజింగ్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ ఫాదర్ జాన్ కిషోర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామం లో భారతీయ జనతా పార్టీ స్థూపం వద్ద జాతీయ జెండాను భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎగురవేసారు. భారతియ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ జెండా ఎగురవేశారు. తిరంగా ర్యాలీ నిర్వహించారు. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం లో 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సర్పంచ్ రాపాక రాజేశ్వరి అధ్యక్షతన ఘనం గా నిర్వహించారు. అక్షర సిద్ధి స్కూల్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు, కరస్పాండెంట్ సనపల సత్యకళ పాఠశాల ప్రధానో పాధ్యాయులు అడ్డాల డేవిడ్ రాజు జెండా వందనం లో పాల్గొన్నారు. యెక్క ప్రాముఖ్యత ను వివరించారు.
స్వర్ణ భారతి ఆంగ్ల మాధ్యమ పాఠశాల ధర్మవరం లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వర్ణ భారతి స్కూల్ కరస్పాండెంట్ పేరిచర్ల రామకృష్ణం రాజు పతాకావిష్కరణ చేశారు. ప్రక్కిలంక గ్రామ పంచాయతీ లో 79. వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం సర్పంచ్ యాళ్ళ స్వప్న అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ స్వప్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కరిబండి విద్యా సంస్థ లోని ఇంటర్, డిగ్రీ, రేడియంట్ హైస్కూల్ ల్లో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డి. మాధవరావు, రేడియంట్ హెడ్ మాస్టర్ శ్రీను లు పతాకావిష్కరణలు చేశారు.
పైడిమెట్ట ఎత్తి పోతల పధకం పంప్ హౌస్ వద్ద 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అధ్యక్షులు ముళ్ళపూడి రామచంద్రం జాతీయ పతాకాన్ని ఆవిష్క్రించారు. ఉపాధ్యక్షులు గన్నిన సత్తిబాబు మరియు సిబ్బంది పాల్గోన్నారు
మానవత స్వచ్ఛంద సేవ సంస్థ తాళ్ళపూడి శాఖ అద్వర్యం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుక నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ను ఛైర్మన్ సింహాద్రి జనార్ధన్ జాతీయ పతాకాన్ని ఎగురవేసారు.


