Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికంటి ద్వారానే వివిధ రోగాలు తెలుసుకొనే అవకాశం మెండుగా ఉన్నాయి..

కంటి ద్వారానే వివిధ రోగాలు తెలుసుకొనే అవకాశం మెండుగా ఉన్నాయి..

రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నర్సింహులు
విశాలాంధ్ర ధర్మవరం ; కన్ను అనేది మానవునికి అతి ముఖ్యమైన శరీరంలో ఒక భాగం అని, కానీ ఆ భాగము ద్వారానే శరీరంలోని వివిధ రోగాలను తెలుసుకొని అవకాశం నిండుగా ఉన్నాయని రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు అనంతపురంలోని మెడికల్ కాలేజీలో గల ఐఎంఏ హాల్లో గల”కన్ను అనే కిటికీ ద్వారా జబ్బుల పై జరిగిన అవగాహన సదస్సుకు”ముఖ్యఅతిథిగా డాక్టర్ నరసింహుల తో పాటు ఐఎంఏ ప్రత్యేక వైద్య నిపుణులు విచ్చేశారు. ఈ అవగాహన సదస్సులో వివిధ విభాగాల మెడికల్ వైద్యాధికారులు, ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొన్నారు. వివిధ నిష్ణాతులైన వైద్యులు పలు విషయాలతో పాటు వివిధ రోగాలు, వాటిని నివృత్తి చేసుకునే విషయాలను తెలియజేశారు. తదుపరి డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ రక్తనాళాలు కంటి ద్వారా మాత్రమే చూసే అవకాశం ఉందని, కంటి ద్వారా షుగరు, బీపీతోపాటు వివిధ రోగాలు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. శరీరంలోని వివిధ భాగాలలో గల రోగాలను కూడా కంటి ద్వారా చూసే అవకాశం మాకు మాత్రమే ఉందని తెలిపారు. కంటి సమస్యలపై సమన్వయంతో పలు విషయాలను కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు. మెదడులో జరిగే పరిణామాలు కంటి ద్వారానే ప్రస్ఫుటం అవుతాయని తెలిపారు. కిడ్నీలు లోని రక్తనాళాలు, కన్ను లోని రక్తనాళాలు ఒకే విధంగా ఉంటాయని వారు తెలిపారు. అంతేకాకుండా కంటికి సంబంధించినటువంటి వివిధ రోగాలు, వాటి నివృత్తిని చేసే పలు అంశాలను స్లైడ్ ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ అక్బర్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ అనంతపురం లక్ష్మణ ప్రసాద్, అధ్యక్షులు శ్రీనాథ్ చేతులు మీదుగా డాక్టర్ నర్సింహులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ వైద్య నిపుణులతో పాటు, వివిధ విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు