Homeజిల్లాలుఅనంతపురంజేఎన్టీయూ ను అగ్రస్థానంలో నిలుపుదాం: వీసీ సుదర్శన్ రావు

జేఎన్టీయూ ను అగ్రస్థానంలో నిలుపుదాం: వీసీ సుదర్శన్ రావు

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ (అనంతపురం) : యువ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిత, ఉపాధి కల్పన, వినూత్న ఆవిష్కరణలను వేదిక నిలిచేలా.. సరికొత్తగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU A ) (ANANTHAPURAM) అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేస్తామని వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. గురువారం ఆర్య భట్టా ఆడిటోరియంలో వీసీ, ఆచార్య ఎస్ కృష్ణయ్య, ఓ ఎస్ డి వీసీ ఆచార్య ఎన్ దేవన్న, డైరెక్టర్లు భానుమూర్తి, దుర్గాప్రసాద్, సత్యనారాయణ, నాగప్రసాద్ నాయుడు, ఓటిపిఆర్ఏ డైరెక్టర్ జి.వి. సుబ్బా రెడ్డి, అనంతపురం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి. చెన్నారెడ్డి క్యాలెండర్స్ ను ఆవిష్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. సి ఏ ఎస్ తో ఎక్కువమందికి పదోన్నతులు ఇచ్చిన ఘనత జేఎన్టీయూ దక్కుతుందన్నారు.వర్శిటి అబివృద్దికి ప్రతి ఉద్యోగి తోడ్పాటు అవసరమని తెలిపారు. 2026 సంవత్సరం లో మంచి మెరుగైన ర్యాంకింగ్ కు కృషి చెయ్యాలని తెలిపారు. ప్రతి ఒక్క ప్యాకల్టీ కష్ట పడి విద్యార్థులకు చదువు తో పాటు క్రమశిక్షణ నేర్పి మంచి పౌరులుగా తీర్చి దిద్దాలని తెలిపారు.రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలోని ఉద్యోగులందరూ ఐక్యత స్ఫూర్తితో.. కలిసికట్టుగా ప్రగతి ప్రయాణంలో విద్యార్థుల ఉజ్వల ప్రగతికి , అభ్యున్నతకు తోడ్పాటును అందిస్తూ.. మిగిలిన విశ్వవిద్యాలయాలకు ఆదర్శంగా నిలవాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు