Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక

ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;;ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చెందిన కే. ధనుష్ ( బి.కాం) తృతీయ సంవత్సరం ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్2025 లో ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం జరిగిందన్నారు . ఎంపికైన ఈ విద్యార్థి మహారాష్ట్ర లోని సెయింట్ గాడ్జ్ బాబా అమరావతి యూనివర్సిటీ లో ఫిబ్రవరి 1 వ తేదీ నుండి ప్రారంభమయ్యేటువంటి ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు ఎస్కే యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. విద్యార్థి కే. ధనుష్ ను కళాశాల ప్రిన్సిపల్ డా . కే ప్రభాకర్ రెడ్డి , ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. చిట్టెమ్మ. అధ్యాపకులు డా.బి గోపాల్ నాయక్ ఎ. కిరణ్ కుమార్, ఎస్.పావని, ఎం.భువనేశ్వరి, వి.హైమావతి, ఎం.సరస్వతి, జి.మీనా, జి. ధనుంజయ, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్ధికి అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు