Homeఆంధ్రప్రదేశ్కడియం లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

కడియం లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

- Advertisement -

.

విశాలాంధ్ర – కడియం : హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు మరియు బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల వీర్రాజు (బాబు) అన్నారు. మండల కేంద్రమైన కడియం గ్రామం శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరి దేవస్థానంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి గణపతి పూజ, పుణ్యాహవాచనం, నారాయణ మండపారాధన, శ్రీకృష్ణ భగవానుడికి అభిషేకం, సహస్రనామ తులసి పత్రి పూజ మరియు సుదర్శన హోమములు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు. సాయంత్రం చిన్నారులు చేసిన భరతనాట్య నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కోలాహలంగా ఉట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలకు, భక్తులకు శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి గోశాల సంరక్షణ సమితి సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు