Homeతెలంగాణనాంపల్లి కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-కార్‌ రేసు విచారణ వాయిదా

నాంపల్లి కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-కార్‌ రేసు విచారణ వాయిదా

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో తదుపరి విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కి వాయిదా పడింది. ఈ కేసులో ఏ1గా ఉన్న భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అర్వింద్ కుమార్ (A2), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి శుక్రవారం ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేతలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్ది సేపు ట్రాఫిక్ స్తంభించింది.ఫార్ములా-ఈ రేస్, ట్రాక్, ఇతర ఖర్చుల పేరిట హెచ్‌ఎమ్‌డీఏ నిధుల నుంచి రూ.55 కోట్లకు పైగా వ్యయం చేశారని ఆరోపణ. అధికారిక రికార్డులు లేకుండా ఖర్చులు చేసి ఆడిట్‌ను తప్పించేందుకు ప్రయత్నించారని ఏసీబీ అభిప్రాయం. మూడు సీజన్ల ఖర్చును ఒకే రేసుకు చూపి కేబినెట్ ఆమోదం పొందకుండా తప్పించుకున్నారని ఆరోపణ.ఆర్‌బీఐ నిబంధనలు, పన్ను విధానాలను ఉల్లంఘించి విదేశీ సంస్థలకు నిధులు బదిలీ చేశారని ఏసీబీ అభియోగం. పన్నుల రూపంలో ప్రభుత్వంపై రూ.8.06 కోట్ల అదనపు భారం పడిందని ఏసీబీ పేర్కొంది. కేటీఆర్, అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు అవసరమైన అనుమతులు లభించిన అనంతరం చార్జిషీట్ దాఖలైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు