వడ్డెర్ల కుల సంఘాల నాయకుల పిలుపు
విశాలాంధ్ర అనంతపురం : ఈ నెల 14న విజయవాడలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ కే. రామకృష్ణ ఆధ్వర్యంలో జరగబోవు బీసీ కులగణన సమావేశాన్ని జయప్రదం చేయాలని వడ్డెర్ల కుల సంఘాల కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బైపాస్ లో వడ్డెర్లు కు పిలుపునిస్తూ మద్దతు తెలియజేస్తూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం వడ్డెఉప్పు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వడ్డే ఉప్పు శ్రీనివాస్, వడ్డే గోపాల్,వడ్డే జయరాం వడ్డే కుళ్లాయప్ప , వడ్డే రామకృష్ణ, కుంచపు వెంకటేష్, వడ్డే మూర్తి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్ల జనాభాను లెక్కించాలిని, జనాభా దామాషా ప్రాతిపదికన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఆర్ అండ్ బి ప్రభుత్వ నిర్మాణ రంగాల్లో వడ్డెర్లకు రిజర్వేషన్ కల్పించాలని, క్వారీల లో 50%రిజర్వేషన్ కల్పించాలని. 50 సంవత్సరాల పైబడిన వడ్డెర్లలకు పెన్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. వడ్డెర విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ లో ఏర్పాటు చేయాలని వడ్డెరలను ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంజుల నారాయణ,, వడ్డే వెంకటేశులు, వడ్డే సుధాకర్, డేరంగుల మధు, కుంచపు సూరి, వడ్డే గంగన్న, తదితరులు పాల్గొన్నారు.


