Homeజిల్లాలుప్రకాశం26న నిరసన ప్రదర్శన జయప్రదం చేయండి

26న నిరసన ప్రదర్శన జయప్రదం చేయండి

- Advertisement -

విశాలాంధ్ర -నాగులుప్పలపాడు : రైతాంగ ,కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 26 వతేది ఒంగోలులో సంయుక్త కిసాన్ మోర్చా ,ట్రేడ్ యూనియన్ల ఆద్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చుండూరి రంగారావు తెలిపారు శనివారం మండలంలోనే ఉప్పుగుండూరు గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగం సంవత్సరం పాటు చేసిన పోరాటం నవంబరు 26 నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యిందన్నారు ఆ పోరాటంలో 736 మంది రైతులు అమరులయ్యారన్నారు. ఆ పోరాటంకు కార్మిక వర్గం మద్దతూ తెలిపారన్నారు ఉద్యమ ఫలితంగా దిగివచ్చిన ప్రభుత్వం 2021డిసెంబరు 9 వతేదిన రాత పూర్వకంగా ఇచ్చిన హమీని నిలబెట్టుకోకుండా కేంద్రప్రభుత్వం ద్రోహపూరితంగా వ్వవహరిస్తుందని విమర్శించారు . అప్పటి నుండి సి 20 ,50 మద్దతూ ధరల చట్టం కోసం రైతుల వ్యవసాయ కార్మికుల రుణ విముక్తి కోసం పోరాటాలు చేయడం జరిగిందన్నారు , తద్వార గత ఎన్నికల్లో బిజెపి స్వంత మెజారిటి కోల్పోయిందన్నారు, తిరిగి మూడో సారి అధికారం చేపట్టిన ఎన్డిఏ ప్రభుత్వం కార్పోరేట్ లకు అనకూలంగా వ్యవహరిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రయివేట్ పరం చేసేందుకు విద్యుత్ చట్టాన్ని తీసుకురావడానికి పూనుకుందన్నారు, రైతులకు మద్దతూ ధర కల్పించక పోగ ఎరువుల కొరత బ్లాక్ మార్కెట్ ప్రకృతి వైపరీత్యాలు రైతాంగాన్ని మరింత కృంగ తీశాయని ఆవేదన వ్యక్తం చేసారు అదేవిదంగా కార్మికులు పోరాడి సాదించుకున్న చట్టాలను నీరుగారుస్తూ పనిగంటలు పెంచేవిదంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందన్నారు అదేవిదంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు లేక నష్టాలబాట పట్టిరన్నారు ఏపంటకు గిట్టుబాటు ధరలేక ఏ పంటవేయాలో అర్దంకాక అయోమయంలో పడ్డిరన్నారు ఈనేపద్యంలో ,రాష్ట్రప్రభుత్వం రైతులవద్ద నిల్వఉన్న శనగలను 10వేలకు కొనుగోలు చేయాలని, మొంధాతుపాన్ కు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహరం ఇవ్వాలన్నారు, ఆవిదంగా రైతులకు ,కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న విదానాలకు వ్యతిరేకంగా మరో రైతాంగ ,కార్మిక ఉద్యమం చేపట్టేందుకు రంగం సిద్దం చేసేందుకు 26 న ఒంగోలులో ఉదయం 10 గంటలకు కర్నూల్ రోడ్ ప్ల్రెఓవర్ బ్రిడ్జి వద్ద నుండి ప్రకాశం భవణం వరకు బైక్ ర్యాలీ నిరసన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం మద్యాహ్నం 3 గంటలకు ఆచార్య రంగా భవన్ లో భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం గురించి కనీస అవగాహణ పౌరహక్కులు భాద్యతలు గురించి వివరించడం జరుగుతుందన్నారు ఆ కార్యక్రమాల్లో రైతులు ,కార్మికులు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో రైతుసంఘం మండల అద్యక్షులు టి శ్రీకాంత్ , జి బసవపున్నయ్య, మాదాసు నాగేశ్వరరావు, యు వెంకటేశ్వర్లు, కాకాని సుబ్బారావు, పాలపర్తి యోనా,జాగర్ల మూడి సాయిప్రసాదు, ఎన్ రామారావు, కె శ్రీనివాసరావు, మిండాల ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు