తర్లుపాడులో ఆరోగ్య హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం.
విశాలాంధ్ర – తర్లుపాడు : మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి రామస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం మార్కాపురం పట్టణంలోని శ్రీ ఆరోగ్య హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో తర్లుపాడు గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి, ఉచిత చికిత్సకు వచ్చిన 90 మందిని పరీక్షించినట్లు ఆరోగ్య హాస్పిటల్ వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ కె కళ్యాణ్ కుమార్ రెడ్డి ఉచిత పరీక్షకు వచ్చిన రోగులకు జనరల్ సర్జరీస్, క్యాన్సర్ సర్జరీస్, ల్యాపరో స్కోపిక్ సర్జరీస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఉచిత వైద్యాన్ని అందించారు. డాక్టర్ యం మధుకిరణ్ రెడ్డి మలేరియా, టైఫా…


