విశాలాంధ్ర. కొమరోలు. గిద్దలూరు పట్టణంలోని పాండురంగారెడ్డి నగర్ ఆనారోగ్యంతో స్వర్గస్తులైన డా. జేవి బ్రహ్మం (75) మృతి పట్ల గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు విచారం వ్యక్తం చేస్తూ ⁰వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. వారితో పాటు గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశా వలి, కౌన్సిలర్లు లోక్కు రమేష్, బిల్లా రమేష్, పందీటి రజిని బాబు, గుర్రం దానియేలు, ఉలాపు బాలచెన్నయ్య, అంగం శ్రీను, వేములపాటి చంటి, మానం ప్రభాకర్, చెన్నయ్య, స్థానిక నాయకులు నివాళులు అర్పించారు.


