Thursday, January 15, 2026
Homeజిల్లాలునెల్లూరుచుండిలో ఫైలేరియా నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది

చుండిలో ఫైలేరియా నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది

- Advertisement -

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : ఫైలేరియా వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించేందుకై ఎవరికైనా ఎలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వలేటివారిపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ వై.కేతోర,చుండి ఎ ఎన్ ఎం. పి. లావణ్య, చుండి ఎం ఎల్ హెచ్ పీ. తేరా శిరీష తెలిపారు. గురువారం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామం లో రాత్రి వేళ వైద్య సిబ్బంది పైలేరియా స్లయిడ్ ల సేకరణ సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైలేరియా ( బోధకాలు ) వ్యాదిని సంపూర్ణంగా అరికట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫైలేరియా వ్యాది నిర్దారణ కోసం జిల్లా మలేరియా అధికారిణి హుసేనమ్మ, సబ్ యూనిట్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి సూచనలతో ఈ రక్త నమూనాలుతీసి పరీక్షిస్తున్నట్లు చెప్పారు. క్యూలెక్స్ దోమ కాటువలన బోధకాలు వస్తుదని పేర్కొన్నారు. దోమకాటు ప్రభావానికి లోనైన వ్యక్తుల శరీరంలో అంతర్లీనంగా ఉండే క్రిమిని గుర్తించి బోధకాలు వ్యాదిని అరికట్టేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని అన్నారు.ఈ సందర్బంగా పైలేరియా వ్యాధి దోమల కారణం గా వస్తుందని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ వై. కేతోర, ఏ ఎన్ ఎం లు పి. లావణ్య(చుండి)విజయకుమారి (అయ్యవారిపల్లి), కళ్యాణి (పోలినేనిచెరువు), ఎం ఎల్ హెచ్ పీ లు తేరా శిరీష (చుండి), సురేఖ(పోలినేనిచెరువు), అనూష (అయ్యవారిపల్లి), ఆశాలు వరమ్మ, వెంకటలక్ష్మి, మరియు ఆదిలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు