Homeఆంధ్రప్రదేశ్రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

- Advertisement -

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగారు.తన పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌ తొలుత రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కూడా పలు నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.అనంతరం రాజమహేంద్రవరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమాల్లో మంత్రి లోకేశ్‌ పాల్గొంటారు. ముందుగా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన ఉత్తమ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశంలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు