Homeఆంధ్రప్రదేశ్నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్

నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్

- Advertisement -

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్.

 విశాలాంధ్ర  – అనపర్తి : అనపర్తికి చెందిన ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయుష్ శాఖ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే. దినేష్ కుమార్ ఐఏఎస్ కు పత్రాలు అందజేశారు.గత 15 ఏళ్లుగా ఎన్నికలు జరగక ఫార్మసిస్టులు రిజిస్ట్రేషన్, రిన్యువల్ సమస్యలు ఎదుర్కొన్నారని ఆది రెడ్డి అన్నారు. ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి ధర్నాలు, ప్రెస్‌మీట్లు, అధికారులను కలవడం ద్వారా కృషి చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 44 మంది పోటీలో ఉన్నారు. 63 వేల రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు ఓటు వేయనున్నారు. తమ ప్యానల్‌ను గెలిపించాలని ఆయన కోరారు. ప్యానల్ సభ్యులు:

సీరియల్ 19 – డా. నల్లమిల్లి ఆది రెడ్డి (అనపర్తి) సీరియల్

13 – కోలా శ్రావణ్ కుమార్ (విశాఖ)

సీరియల్ 16 – కోటిపాటి రాధాకృష్ణ (కడప)

సీరియల్ 18 – నాగకృష్ణరాజు ఇమ్మండి (ప.గోదావరి)

సీరియల్ 23 – నరేష్ లక్క (విజయవాడ)

సీరియల్ 40 – వేమూరు మాలతి (కృష్ణా)

ఫార్మసిస్టుల కోసం శాశ్వత భవనం, కమ్యూనిటీ హాల్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం, కనీస వేతనం ₹35,000, ఔట్సోర్సింగ్ స్టాఫ్‌కు శాశ్వత అవకాశాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిస్థాయి అమలు కోసం కృషి చేస్తామని ఆది రెడ్డి తెలిపారు.సామాజిక సేవల్లో కూడా ముందుండే ఆది రెడ్డి – అన్నదానాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, పర్యావరణ కార్యక్రమాలు, పేదలకు వైద్య సహాయం వంటి అనేక సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు