Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

ధర్మవరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

- Advertisement -

బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;;వ్యసనాలకు, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపినప్పుడే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయం అనే సందేశంతో ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ధర్మవరం పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం 1938లో ప్రారంభమై దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా కేవలం ఆధ్యాత్మిక చింతనకే పరిమితం కాకుండా వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం, సమాజ నిర్మాణం కోసం విశేష సేవలు అందిస్తోందని మంత్రి కొనియాడారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి, డిఎస్పి బివి జగన్నాథ్ రాజు, నిర్వాహకులు సోదరి రాధా, సోదరి శారద, సోదరి కల్పన, గోపి సోదరుడు, బ్రహ్మకుమారి సోదర సోదరీమణులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు