తహసిల్దార్ అప్పారావు
(పశ్చిమగోదావరి జిల్లా)
విశాలాంధ్ర – గణపవరం: రైతులకు రాజముద్రతో క్రొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు గణపవరం తహసిల్దార్ వై కె వి అప్పారావు చెప్పారు. శుక్రవారం 2వ తేదీన నుంచి ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు చేతుల మీదుగా తప్పులు లేని క్రొత్త పాస్ పుస్తకాలను పంపిణీ జరుగుతుందని చెప్పారు. మండలంలో చిలకంపాడు, చిన రామచంద్రపురం, గణపవరం, జగన్నాధపురం, జల్లి కాకినాడ, కొత్తపల్లి, సరిపల్లి , వాకపల్లి , వరదరాజ పురం, వీరేశ్వర పురం, వెలగపల్లి, వెంకటరాజపురం మొత్తం 12 గ్రామాలలో 2 వ తారీఖు నుంచి 9 వ తారీఖు వరకు పాస్ బుక్స్ ను పంపిణీ జరుగుతుందని అన్నారు.పాస్ బుక్ పంపిణీ సమయంలో భూ యజమాని లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తప్పనిసరిగా హాజరుకావాలని వారి ఈ- కేవైసి తీసుకొని పాస్ బుక్ పంపిణీ చేస్తామని అన్నారు.


