Homeజిల్లాలుశ్రీ సత్యసాయితండ్రిని కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక చేయూత ఇచ్చిన మానవతా సంస్థ

తండ్రిని కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక చేయూత ఇచ్చిన మానవతా సంస్థ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుడ్ సెట్ కొట్టాలలో చేనేత కార్మికుడిగా జీవనం చేస్తున్న ఓ తండ్రి మూడు నెలల కిందట మృతి చెందడం జరిగింది. ఈ సమాచారాన్ని అందుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు, ఆ కుటుంబం వద్దకు వెళ్లి, తమవంతుగా 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కూతురు బిటెక్ రెండవ సంవత్సరం చదువుతూ ముగింపు అవుతుందనే బాధ తన చిన్నాన్న ద్వారా మాకు తెలియడంతో మేము ఈ ఆర్థిక సహాయాన్ని మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఈ ఆర్థిక సహాయములో ఎంతోమంది సహకారం అందించిన దాతలకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ఆర్థిక సహాయం అందించినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు