దేశంలో ఎల్‌పీజీ సిలిండర్ల రీఫిల్ బుకింగ్ గడువు మారుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ బుధవారం స్పందించింది. పాత నిబంధనలకు అనుగుణంగానే బుకింగ్‌లు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది.. ‘‘రీఫిల్ బుకింగ్ గడువు పెంపుపై మీడియాలో వస్తోన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అవన్నీ నిరాధారం. గ్యాస్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవు. కనెక్షన్‌తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు అలాగే కొనసాగుతోంది. దీనిపై జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నాం. గ్యాస్ బుకింగ్ విషయంలో ఆందోళనలు వద్దు. అవసరం లేకపోయినా బుకింగ్‌లు చేయొద్దని కోరుతున్నాం అని కేంద్రం తమ ప్రకటనలో స్పష్టతనిచ్చింది. డబుల్ సిలిండర్ ఉంటే గ్యాస్ బుకింగ్ మధ్య అంతరాన్ని 35 రోజులకు పెంచినట్లు నిన్నటినుంచి వార్తలు వచ్చాయి. ఇక, సింగిల్ సిలిండర్‌కు 25 రోజులు, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన (పీఎంయూవై) వినియోగదారులకు సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజులకు పెంచినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది.
గ్యాస్ బుకింగ్‌కు 35 రోజుల వార్తలు.. కేంద్రం క్లారిటీ
- Advertisement -
RELATED ARTICLES


