విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవరాయుడు పాలెం లో గల అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శివ పంచాయతన క్షేత్రం మూడవ వార్షికోత్సవ వేడుకలు గ్రామసర్పంచ్ అన్నందేవుల చంటి విజయ దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అప్పల ఫణి తెల్లవారుజాము నుండీ స్వామి వారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలలో సర్పంచ్ అన్నందేవుల చంటి కుమారుడు, ఫ్రీడం చార్టర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈవో అన్నందేవుల మణీందర్, ప్రేమ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈవేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని, అన్న ప్రసాదాలు స్వీకరించారు.
ఘనంగా శివ పంచాయతన క్షేత్రం మూడవ వార్షికోత్సవ వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


