Homeఆంధ్రప్రదేశ్అక్టోబర్‌లో నోటిఫికేషన్‌.. డిసెంబర్‌లో పరీక్షలు: డీఎస్సీపై నారా లోకేశ్‌

అక్టోబర్‌లో నోటిఫికేషన్‌.. డిసెంబర్‌లో పరీక్షలు: డీఎస్సీపై నారా లోకేశ్‌

- Advertisement -

నేటి నుంచి ఏపీ టెట్ ప్రారంభం
అభ్యర్థులకు మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నేటి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్” వేదికగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టెట్ పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇచ్చిన హామీ ప్రకారమే జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ మేరకు తదుపరి డీఎస్సీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు. అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు