– విశాలాంధ్ర కథనానికి స్పందన
విశాలాంధ్ర – సీతానగరం: అనధికారిక బొండు మట్టి తోలకాలు పై అధికారులు చర్యలు. నవంబర్ 5వ తేదీన అక్రమ ఇసుక రవాణా పై చర్యలు ఏవీ అని విశాలాంధ్ర పత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ ఆదివారం అక్రమ బొండు మట్టి తోలకాలు జరుపుతున్న మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండలంలో సీతానగరం గ్రామంలో గల కైలాసగిరి ర్యాంపు నుంచి గత కొన్ని రోజులుగా అక్రమ ఇసుక, బొండు మట్టి తోలకాలు యదేచ్చగా జరుపుతున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో అధికారులు స్పందిస్తూ ఎట్టకేలకు తూతూ మంత్రంగా మూడు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు కానీ మరి అర్దరాత్రి, తెల్లవారు జామున ఇసుక తోలకాలు జరుపుతున్న ట్రాక్టర్లు ఎందుకు పట్టుకోవడం లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా అక్రమ బొండు మట్టి ఇసుక తోలకాలపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు కొంతమంది నాయకుల అండదండలతో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఇటువంటి అనధికారిక తోలకాలు వల్లే కూటమి ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుంది అని కొంత మంది నాయకులు సైతం అవేదన వ్యక్తం చేస్తున్నారు.


