విశాలాంధ్ర – కడియం : ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థలో భాగస్వామిగా ఉంటూ, సమాజసేవలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న సాకా అనిత అభినందనీయురాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు, ఆదర్శ రైతులు, సమాజ సేవకులకు సన్మాన కార్యక్రమం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం మండలం వెంకాయమ్మపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని సాకాఅనిత , వెంకటేశ్వరరావు దంపతులు చేయూతసంస్థ ఆదరిస్తున్న బాధిత బాలల పౌష్టికాహారం నిమిత్తం 25 వేలు రూపాయలు చెక్ ను ఎంపీ చేతులు మీదుగా అందజేసారు. పేద విద్యార్థుల దత్తత , చదివించడం, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయం, ప్లాసిక్ నిషేధం కొరకు కృషి, పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటడం వంటి తదితర కార్యక్రమాలు చేపడుతున్న అనిత సేవలను గుర్తించి “ఆచార్య దేవోభవ” అవార్డును మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చేతులు మీదుగా అందజేసారు. ఈకార్యక్రమంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, చేయూత సంస్థ నిర్వాహకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయిని “అనిత” సేవలు అభినందనీయం
- Advertisement -
RELATED ARTICLES


