విశాలాంధ్ర పుట్టపర్తి: – సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు ఆహార ధాన్యాల వల్ల ఆరోగ్యంగా ఉంటామని సేల్స్ మేనేజర్లు రాజశేఖర్, కృష్ణ తెలిపారు. శుక్రవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో టింబక్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వంటకాల ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. స్వయంగా వంటలు వండి పుట్టపర్తి వాసులకు వడ్డించారు. ఈ క్రమంలోనే టింబక్టు ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహార ధాన్యాలను అమ్మకానికి ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు ఆహార ధాన్యాల వల్ల ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ సేంద్రీయ వంటకాలను అలవర్చుకోవాలన్నారు. తాతల కాలం నాటి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల భూమి సారవంతంగా మారుతుందని అందులో పండించిన పంటలు కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా మనకు అందుతాయన్నారు. ఆ దిశగా సేంద్రియ వ్యవసాయం మనిషి జీవనశైలిలో ఎంతో మార్పు తీసుకువస్తుందన్నారు. విత్తనాలను రైతులకు మేమే అందించడమే కాకుండా ఏ విధమైన మెలకువలు పాటించాలని వివరించి దిగుబడిగా వచ్చిన పంటను కూడా మేమే కొనుగోలు చేస్తామన్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలను రైతుల వద్ద మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టింబర్ ఆర్గానిక్ సిబ్బంది మోహన్ రెడ్డి, శంకర్, కవిత తదితరులు పాల్గొన్నారు.
సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు ఆహార ధాన్యాల వల్ల ఆరోగ్యం
- Advertisement -
RELATED ARTICLES


